జ్ఞాన దంతాలు అంటే ఏమిటి?

జ్ఞాన దంతాలు అంటే ఏమిటి? Home జ్ఞాన దంతాలు అంటే ఏమిటి? జ్ఞాన దంతాలు అంటే ఏమిటి? సాధారణంగా 17 నుంచి 25 ఏళ్ల వయసులో, పెద్దయ్యాక వచ్చే దంతాలను ‘జ్ఞానదంతాలు’ అంటారు. దవడ భాగంలో చివరన ఆహారాన్ని నమలడానికి వచ్చే పెద్ద దంతాల వరసలో ఇవి చివరివి. నోటిలోని మిగతా 28 పళ్లు వచ్చాక ఎలాంటి ఆటంకాలు లేకుండా వస్తే, ఇవి కూడా నమలడానికి మిగతా దంతాల వలె ఉపయోగపడతాయి. అయితే ఇవి ఆలస్యంగా రావడం వల్ల, అప్పటికే దంతాల పలువరసలో వీటికి తగినంత స్థలం లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలుంటాయి. జ్ఞాన దంతాల వల్ల వచ్చే సమస్యలు చిగురును చీల్చుకురావడంతో ఆ ప్రదేశంలో నొప్పి, వాపు, ఆ భాగం ఎర్రబారడం. కొన్నిసార్లు చిగుర్ల నుంచి చీము స్రవించడం. మెడ వద్ద ఉండే లింఫ్ గ్రంథుల వాపు మరియు నొప్పి కారణంగా జ్వరం రావడం. చిగుర్లలో నొప్పి, వాపు, మంట వంటి కారణాలతో ఆహారం మింగడంలో ఇబ్బందులు. జ్ఞాన దంతాల సమస్యలకు కారణాలు (ఇంపాక్షన్) దంతాల అమరికకు ఉన్న స్థలం సరిపోయేంతగా లేకపోవడం. దవడ వరస సన్నగా ఉండటంతో జ్ఞానదంతానికి తగినంత స్థలం దొరకకపోవచ్చు. జ్ఞానదంతం వచ్చే సమయానికి ఆ పక్కనే ఉన్న పన్నుకూ, ఈ మొలుస్తున్న పన్నుకూ మధ్యన ఏదైనా గట్టి జామగింజ లాంటి బయటి వస్తువు (ఫారిన్బాడీ) చిక్కుకుపోతే దాని దిశ మారవచ్చు. ఇలా జ్ఞానదంతం సరిగా మొలవడానికి ఆస్కారం లేక, మిగతావాటితో సమన్వయం లేకుండా కాస్త అటు ఇటుగా మొలవడాన్ని ‘ఇంపాక్షన్’ అంటారు. ఇంపాక్టెడ్ జ్ఞానదంతాల రకాలు మెసియో యాంగ్యులార్ ఇంపాక్షన్: పలువరస ఉన్న దవడలో జ్ఞానదంతం కాస్త ముందువైపునకు తోసుకువస్తూ ఇబ్బంది కలిగిస్తుంది. ఈ తరహా సమస్య 44 శాతం మందిలో ఉంటుంది. వర్టికల్ ఇంపాక్షన్: జ్ఞానదంతం దవడ నుంచి పూర్తిగా బయటికి రాకుండా, కొంతభాగం మాత్రమే పైకి వస్తుంది. ఇది దాదాపు 38 శాతం మందిలో కనిపిస్తుంది. డిస్టో యాంగ్యులార్ ఇంపాక్షన్: జ్ఞానదంతం నోటిలో వెనకవైపునకు పెరుగుతుంటుంది. ఇది ఆరు శాతం మందిలో ఉంటుంది. హారిజాంటల్ ఇంపాక్షన్: సాధారణంగా జ్ఞానదంతం దవడకు నిలువుగా (90 డిగ్రీల కోణంలో) రావాలి. అలా కాకుండా పూర్తిగా లోపలి వైపునకు పెరిగితే దాన్ని హారిజాంటల్ ఇంపాక్షన్ అంటారు. ఈ సమస్య మూడు శాతం మందిలో ఉంటుంది. జ్ఞాన దంతం సరిగ్గా రానప్పుడు కలిగే దుష్పరిణామాలు పళ్లు తోముకోవడం, నోరు శుభ్రం చేసుకోవడం సరిగ్గా జరగక పన్ను పుచ్చిపోవడం, రంధ్రం పడటం, చిగురుకు నొప్పి రావడం, పుండు పడటం (యాబ్సెస్) జరగవచ్చు. దీనివల్ల నోటినుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. జ్ఞానదంతం నిలువుగా రాకుండా మిగతా వాటిని నొక్కుకుంటూ వస్తే, దంతాల వరస అడ్డదిడ్డంగా మారవచ్చు. దీన్నే క్రౌడింగ్ అంటారు. ఇది చిగురును ఒరుసుకుంటూ, కోసుకుంటూ వచ్చినప్పుడు చిగుర్ల వ్యాధికి దారితీసే అవకాశముంది. జ్ఞాన దంతాన్ని ఎప్పుడు తొలగించాలి? జ్ఞానదంతం పూర్తిగా దవడ నుంచి బయటకు రాకుండా, కొద్దిగా మాత్రమే బయటకు వచ్చినప్పుడు. నమలడానికీ, నోటి ఆరోగ్యానికీ ఇబ్బందిగా మారినప్పుడు. అడ్డదిడ్డంగా పెరుగుతూ మిగతా పలువరసను దెబ్బతీస్తున్నప్పుడు, పక్కనున్న పంటి వేరు (రూట్)ను దెబ్బతీస్తున్నప్పుడు. ‘ఇన్ఫీరియర్ ఆల్వియోలార్ నర్వ్’ అనే నరాన్ని దెబ్బతీస్తూ, దానిపై ఒత్తిడి వల్ల ఒక్కోసారి పెరాలసిస్కు దారితీసే అవకాశమున్నప్పుడు. చిగుర్లపై చీము పేరుకుపోయి చిగుర్ల కణజాలానికీ, దవడ ఎముకకూ నష్టం చేస్తున్నప్పుడు. గమనిక: పైన పేర్కొన్న సందర్భాల్లో చిన్న శస్త్రచికిత్స సాయంతో దంతవైద్యులు జ్ఞానదంతాన్ని తొలగిస్తుంటారు. అయితే దంతం సక్రమంగా వస్తూ, దవడ చిగుర్లలో ఇరుక్కుపోతే… చిగురు పైభాగాన్ని కాస్త తొలగించి దానికి తగిన దారి కల్పించి మామూలుగా వచ్చేందుకు దోహదపడవచ్చు. కాబట్టి ప్రతిసారీ జ్ఞానదంతాల్ని తొలగించాల్సిన అవసరం ఉండదు. కొన్నిసందర్భాల్లో జ్ఞానదంతం అంకురాన్ని (బడ్) ఉపయోగించి దంతం రాని చోట వచ్చేలా చేసేందుకు కూడా ఆస్కారం ఉంది.
వృద్ధాప్యంలో దంత సమస్యలు

వృద్ధాప్యంలో దంత సమస్యలు Home వృద్ధాప్యంలో దంత సమస్యలు వృద్ధాప్యంలో దంత సమస్యలు (జీరియోడాంటిక్స్) పెద్దవయసువారిలో వచ్చే దంతసమస్యలు! వృద్ధులకు వయసు పరంగా వచ్చే అనేక సమస్యలతో పాటు పళ్ల సమస్యలూ తప్పవు. వృద్ధుల పళ్లకు సంబంధించిన వైద్యశాస్త్రాన్ని ‘జీరియాట్రిక్ డెంటిస్ట్రీ’ లేదా జీరియోడాంటిక్స్’ అంటారు. ఇందులో వృద్ధుల పళ్లకు వచ్చే వైద్య, ఆరోగ్య సమస్యలు, వాటి నిర్ధారణ, చికిత్స వంటి అంశాలుంటాయి. పళ్లు కోల్పోకుండా కేవలం వాటికి వచ్చే సమస్యలను మాత్రమే పోగొట్టుకోవడమెలాగో చెప్పే కథనమిది. ఇటీవలి వైద్యవిజ్ఞానం బాగా పురోగతమించింది. దాంతో గతం సగటుతో పోలిస్తే ప్రజల సగటు ఆయుర్దాయమూ బాగా పెరిగింది. ప్రజలు చాలాకాలం జీవిస్తున్నారు. దాంతో సమాజంలో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకనాడు ముసలితనానికి బోసినోరు ఒక ప్రతీక. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. జీవితంలో కష్టపడాల్సినంత పడి… తమ వృద్ధాప్యాన్ని ఒక సంతోషకరమైన మజిలీగా చేసుకుంటూ ఇకపై జీవితాన్ని అనుభవించాల్సిందంతా ఈ వయసునుంచే అనే భావన పెరగడంతో ఆ వయసునూ ఆనందమయం చేసుకుంటున్నారు. ఫలితంగా ఒకనాడు పళ్లూడిపోయే వృద్ధులకు బదులు మంచి పలువరస ఉన్నవారే ఎక్కువగా కనబడుతున్నారు. ఎందుకంటే… ఎంతగా వయసు పైబడినప్పటికీ పళ్లు, చిగుర్ల సమస్యలు రాకుండా చూసుకుంటే పళ్లు ఎన్నాళ్లైనా గట్టిగానే ఉంటాయి. ఇందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం. వృద్ధాప్యంలో వచ్చే పంటి సమస్యలు/కారణాలు సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ పళ్లు కూడా వదులైపోతాయన్నది చాలామందిలో ఉండే ఓ అపోహ. ఆ వయసులో బీపీ, షుగర్ లాంటి సమస్యలుంటే పళ్లు వాటంతట అవే ఊడిపోతాయని అనుకుంటారు. ఆ పరిస్థితి కోసం మానసికంగా సిద్ధపడుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. పళ్లకు లేదా చిగుర్లకు సంబంధించన జబ్బులు వస్తేనే పళ్లు ఊడిపోవడమో లేదా వదులైపోవడమో లేదా తీసేయాల్సిన పరిస్థితి ఎదురుకావడమో జరుగుతుంది. నోటి జబ్బులు రానంతవరకు పళ్లు జీవితకాలం దృఢంగానే ఉంటాయి. వృద్ధాప్యంలో దంతాలకు వచ్చే వైద్యసమస్యలు:సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని దంత సమస్యలు పంటిమూలంలో వచ్చే పిప్పిపళ్లు (రూట్కేరిస్), పళ్లు ఊడిపోవడం (అట్రిషన్), చిగుర్లవ్యాధులు (పెరియోడాంటల్ డిసీజ్), పళ్ల మధ్య అక్కడోపన్ను, ఇక్కడోపన్ను కోల్పోవడం కారణంగా వచ్చే సందులు (ఎడెంట్యುలిజమ్), పైవరస పళ్లు, కిందివరస పళ్ల గట్టిదనంలో నాణ్యత లేకపోవడం (పూర్ క్వాలిటీ ఆఫ్ అల్వియొలార్ రిడ్జ్), కట్టుడుపళ్లు సరిగా అమర్చకపోవడం, దవడల పక్కన ఉండే మృదువైన మ్యూకోజాలో పుండ్లు, నోటిలో పుండ్లు, నోటిలో తడి తక్కువ కావడం (గ్జీరోస్టోమియా), నోటి క్యాన్సర్లు వంటివి. చేజేతులారా తెచ్చిపెట్టుకునే సమస్యలు:ఇక మరికొన్ని యౌవనంలో ఉన్నప్పుడు మనలో కొందరు వారంతట వారే చేజేతులారా తెచ్చిపెట్టుకునేవే ఎక్కువ. ఉదాహరణకు వయసులో ఉన్నప్పుడు పొగతాగడం, పొగాకు నమలడం, పాన్పరాగ్, గుట్కా, వక్కపొడి నమలడం వంటి పంటికి చేటు చేసే అలవాట్లు. ఈ అలవాట్లను మానకపోవడం, అలా నిర్లక్ష్యం చేస్తూ పోవడం వల్ల వృద్ధాప్యంలో పళ్లు తీవ్రంగా దెబ్బతింటాయి. వృద్ధాప్యంలో వ్యాధినిరోధక శక్తి తగ్గడంతో: యౌవనంతో పోలిస్తే వృద్ధాప్యదశలో వ్యాధినిరోధకశక్తి ఎంతోకొంత తగ్గుతుంది. కాబట్టి అప్పటివరకూ నిద్రాణంగా ఉన్న కొన్ని సమస్యలు పళ్లపై ప్రభావం చూపుతాయి. వృద్ధాప్యంలో వాడుతూ ఉండే మందుల కారణంగా: పెద్దవయసు వచ్చేనాటికి చాలామందిలో హై-బీపీ, షుగర్ సమస్యలు కనిపిస్తాయి కాబట్టి వాటికోసం మందులు వాడుతుంటారు. ఇలా… బీపీ, షుగర్లను అదుపులో పెట్టేందుకు వాడే మందులు మానసిక సమస్యలకోసం వాడే యాంటీసైకోటిక్, యాంగ్జెటీని తగ్గించడం కోసం వాడే యాంగ్జియోలైటిక్స్… ఇలాంటి మందుల కారణంగా నోటిలో లాలాజల స్రావాలు తగ్గుతాయి. దాంతో అవి నోటిని పొడిబారిపోయేలా చేస్తాయి. ఈ అంశం కూడా దంతసమస్యలకు కారణమవుతుంది. వృద్ధాప్యంలో సంపాదన లేమితో: వృద్ధాప్యంలో చాలామందికి మునుపు ఉన్నంత సంపాదన ఉండదు. ఇలా తమకు ఉండే ఆదాయవనరులు తగ్గిపోవడం, దానికి తోడు కుటుంబసభ్యుల నుంచి అందాల్సినంత ప్రోత్సాహం లేకపోవడమనే అంశం కూడా దంత సమస్యలకు ఓ పరోక్ష కారణమవుతుంది. పైన పేర్కొన్న అనేక సమస్యల కారణంగా పళ్లు వదులైపోవడంతో వృద్ధాప్యంలో ఆహారం తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాదు.. పళ్ల వల్లనే మానవుల్లో ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది. పళ్లలో సమస్యల కారణంగా భాషలో స్పష్టతా లోపించి కమ్యూనికేషన్కూ ఇబ్బందులు కలుగుతాయి. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలూ – పళ్లపై వాటి ప్రభావాలు: డయాబెటిస్… పళ్ల సమస్యలు: ఈ రెండు అంశాలూ ఒకదాని కారణంగా మరొకటి కనిపిస్తూ ఉంటాయి. అంటే డయాబెటిస్ ఉన్నవారిలో పళ్లూ, చిగుళ్ల సమస్యలు ఎక్కువ. అలాగే పళ్లూ చిగుళ్ల సమస్యలు ఉన్నవారిలో… ఆ అంశాలు రక్తంలోని గ్లూకోజ్ పెరిగేలా చేసి, డయాబెటిస్కు కారణమవుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారూ పంటి జబ్బుల విషయంలో జాగ్రత్తపడాలి. లేనివారూ పళ్లను శుభ్రంగా ఉంచుకుని డయాబెటిస్ ను రాకుండా నివారించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారికి సీరియస్ చిగుర్ల సమస్యలు, దంతక్షయం, లాలాజల గ్రంధులు సరిగా పనిచేయకపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, లైకెన్నస్, లైకెనాయిడ్ రియాక్షన్, నోటి ఇన్ఫెక్షన్లు అంత తేలిగ్గా తగ్గకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. నివారణకు సూచనలివి: పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఆర్నెల్లకోమారు దంతవైద్యుడిని కలిసి క్లీనింగ్ చేయించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో గ్లూకోజ్ పాళ్లను సమర్థంగా నియంత్రించుకుంటూ ఉండేలా తగిన మందులు తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్లు సూచించినవిధంగా తాము తీసుకోవాల్సిన ఆహారాన్ని తీసుకోవాలి. గుండెజబ్బులూ… చిగుర్ల వ్యాధులు: ఇటీవలి కొత్త పరిశోధనల వల్ల నోటి ఆరోగ్యానికీ, గుండెజబ్బులకూ దగ్గరి సంబంధం ఉందని తేలింది. సాధారణంగా చిగుర్ల వ్యాధి ఉన్నవాళ్లలో… తమకు పెద్దగా నొప్పి తెలియకుండానే పంటికింద ఉండే గులాబిరంగు చిగురుభాగం నెమ్మదిగా కిందికి కిందికి తగ్గుతూ పోతుంది. కానీ పంటి కింది ఎముక భాగం కూడా నాశనమయ్యే దశకు చేరినప్పుడు, అక్కడ చేరిన బ్యాక్టీరియా రక్తప్రవాహంలో కలుస్తుంది. దాంతో అది గుండె కండరాన్ని దెబ్బతీసి, గుండెజబ్బులకూ దారితీసే ప్రమాదం ఉందని ఇటీవలి అనేక పరిశోధనల వల్ల తేలింది. ఇక పంటి మీద ఉండే పాచి/గారలో ఉండే సూక్ష్మక్రిములు రక్తనాళాలల్లోకి చేరడం వల్ల రక్తనాళాలు సన్నబడి కూడా రక్తప్రవాహ సంబంధమైన (వాస్క్యులార్ డిసీజెస్) సమస్యలు రావచ్చు. పెద్దవయసువారంతా తెలుసుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే దీర్ఘకాలంగా ఉండే చిగుర్ల వ్యాధుల వల్ల అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు ముప్పు కూడా ఉంటుంది. నివారణకు సూచనలివి: ఈ సమస్య నివారణకు చేయాల్సిందల్లా సరైన రీతిలో బ్రషింగ్, మన ఆహారాన్ని బాగా నమిలి మింగడం. ఈ రెండూ శ్రద్ధగా చేస్తూ ఉంటే… పెద్దవయసు వారిలో చాలావరకు గుండెజబ్బులనూ, గుండెపోటునూ నివారించవచ్చు. హైబీపీ – పంటిసమస్యలు: ఈ రెండు అంశాలకూ మధ్య సంబంధం ఉంది. హై-బీపీతో బాధపడేవారిలో వాళ్ల అధిక రక్తపోటు అనే అంశం గుండెజబ్బులకూ, గుండెపోటుకు దారితీయకుండా కొన్ని మందులు ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. పంటి సమస్యలు ఉన్నవారికి ఇచ్చే నాన్స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ మందుల) వల్ల… హై-బీపీ ఉన్నవారు తాము తీసుకునే మందుల ప్రభావం తగ్గుతుంది. దీంతో పాటు మరో ప్రమాదమూ ఉంది. హై-బీపీ ఉన్నవారికి ఇచ్చే మందుల వల్ల నోటిలో తడి తగ్గి అది జీరోస్టోమియా అన్న కండిషన్కు దారితీస్తుంది. ఈ జీరోస్టోమియా కూడా పంటి సమస్యలను పెంచడమే కాకుండా… పలువరసలో అమర్చిన కృత్రిమ దంతాలకూ, స్క్రూల వంటి అనుబంధ అంశాలకూ నోటిలోని మృదుకండరాలకూ మధ్య ఘర్షణ (ఫ్రిక్షన్)ను పెంచి మరిన్ని పంటి సమస్యలకు దారితీసేలా చేస్తుంది. క్యాల్షియమ్ బీటా బ్లాకర్స్ అనే మందులు వాడే పది శాతం మందిలో దాని తాలూకు సైడ్అఫెక్ట్గా జింజివల్ హైపర్ప్లాసియా అనే చిగుర్లవ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి మందులు మొదలుపెట్టిన కొన్ని నెలల్లోనే కనిపిస్తుందని అనేక పరిశీలనల్లో తేలింది. నివారణకు సూచనలివి: హైబీపీకి మందులు వాడేవారు తమకు ఎదురైన అనుభవాన్ని తమ ఫిజీషియన్ను వివరించి, తరచూ తమ దంతవైద్యులను కూడా కలిసి తమ మందులను వారిచేత కూడా సమీక్షింపజేసుకుంటూ ఉండాలి. సరైన నోటి శుభ్రత పాటిస్తూ డయాబెటిస్ను సాధ్యమైనంతవరకు నివారించుకుంటూ ఉండటం మేలు. పక్షవాతం – పంటి జబ్బులు: పక్షవాతానికి, పంటిజబ్బులకూ నేరుగా సంబంధం లేకపోయినా… గుండెజబ్బులకు ఉన్న సంబంధమే ఇక్కడా పనిచేస్తుంటుంది. ఉదాహరణకు పంటికి పట్టే గార పాచీ (ప్లాక్) వంటివి పంటి జబ్బుల వల్ల రక్తప్రవాహంలో పేరుకుపోయే సూక్ష్మక్రిముల వల్ల రక్తనాళాలు సన్నబడటం, రక్తనాళాల్లో ప్లాక్ పేరుకుని అది రక్తం సాఫీగా ప్రవహించకుండా అడ్డుపడటం జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఇదే ప్రమాదం గుండెకు సంబంధించిన ధమనుల విషయంలో జరిగితే అది గుండెపోటుకు దారితీస్తుంది. ఒకవేళ అదే మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల (ధమనుల) విషయంలో జరిగితే అది పక్షవాతానికి దారితీసే ప్రమాдуంటుంది. నివారణకు సూచనలివి: పంటి జబ్బులను నివారించుకోవడం లేదా నిరోధించుకోవడం; పంటి సమస్యలను దూరం చేసుకోవడం; పంటి శుభ్రతను పాటించడం (డెంటల్ హైజీన్) వల్ల ఒకవైపు గుండెజబ్బులనూ మరోవైపున పక్షవాతాన్నీ నివారించుకోగలమని గుర్తుంచుకోవాలి. ఆర్థరైటిస్… పంటి సమస్యలు: దాదాపుగా 65 ఏళ్లుదాటిన 50 శాతం మందిలో ఎముకలకు సంబంధించిన జబ్బు అయిన ఆర్థరైటిస్ కనపడుతుంది. దీనివల్ల ఎముకల మధ్య రాపిడి, ఎముకల సాంద్రత తగ్గి, పెళుసుగా మారడం, ఫలితంగా అవి తేలిగ్గా విరిగిపోవడంలాంటివి తరచూ జరుగుతుంటాయి. ఈ జబ్బులో కూడా ఎముకలు, కీళ్ల మధ్య నొప్పిని నివారించడానికి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ మందులు) వాడటం సాధారణం. ఈ ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి సాధారణంగా మెథోట్రెక్సేట్ అనే మందులను ఉపయోగిస్తారు. ఇవన్నీ నోటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే. ఉదాహరణకు మెథోట్రెక్సేట్ మందులు వాడేవాళ్ల నోళ్లలో పుండ్లు (అల్సర్స్) వస్తుంటాయి. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్కు వాడే గోల్డ్ సోడియమ్ థయోమెలనేట్ అనే మందు వల్ల జింజివైటిస్ అనే చిగుర్లకు వచ్చే ఇన్ఫెక్షన్, గ్లాసైటిస్ అనే నాలుక ఇన్ఫెక్షన్, స్టొమటైటిస్ అనే నోటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇక పై మందుల వాడకం వల్ల రక్తంలోని తెల్లరక్తకణాలు తగ్గడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం వంటి దుష్పరిణామాలూ ఉంటాయి. కాబట్టి వాటి వల్ల రోగనిరోధకశక్తి తగ్గడం, పంటి చిగుర్ల నుంచి రక్తస్రావం వంటి పరిణామాలూ కనిపిస్తుంటాయి. లాలాజల గ్రంథులు… నోటి సమస్యలు: నోటిలో ఉరుతూ ఉండే
బ్రక్సిజమ్ అంటే?

బ్రక్సిజమ్ అంటే…? Home బ్రక్సిజమ్ అంటే…? డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి (సీనియర్ డెంటల్ సర్జన్), డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వై. (సీనియర్ సైకియాట్రిస్ట్ అండ్ హెడ్ ఆఫ్ సైకియాట్రీ డిపార్ట్మెంట్, ఎంజీఎం గవర్నమెంట్ హాస్పిటల్, వరంగల్) అందించిన వివరాల ప్రకారం ‘బ్రక్సిజమ్’ (Bruxism) గురించిన సమాచారం: బ్రక్సిజమ్ అంటే…? కొందరు పిల్లలు, అరుదుగా కొందరు పెద్దలు నిద్రలో పళ్లు కొరుక్కుంటుంటారు. కోపం వచ్చినప్పుడు బిగబట్టినట్టుగానే దవడలు బిగబట్టి నిద్రలో పళ్లు నూరుతుంటారు. ఈ కండిషన్ను వైద్యపరిభాషలో ‘బ్రక్సిజం’ అంటారు. వాళ్లలోని తీవ్రమైన మానసిక ఒత్తిడి, యాంగ్జెటీ వంటి పరిస్థితులే ఇందుకు కారణం. దీన్ని కొంతవరకు ఓ స్లీప్ డిజార్డర్గా కూడా పరిగణిస్తుంటారు. ఎప్పుడో ఒకసారి పళ్లు బిగబట్టడం, కోపం వచ్చినప్పుడు పళ్లు కొరకడం సహజం. కానీ నిత్యం నిద్రలో ఇది జరుగుతుంటే మాత్రం దీన్ని రుగ్మతగా పరిగణించాల్సిందే. ఇది పెద్దగా అపాయకరమైన కండిషన్ కాదు. పిల్లల్ని డెంటల్ సర్జన్ దగ్గరికి తీసుకెళ్లినప్పుడు వారి పళ్లను చూసి డాక్టర్లు గుర్తిస్తుంటారు. లక్షణాలు తలనొప్పి (ముఖ్యంగా ఉదయం వేళల్లో ముఖం కూడా నొప్పిగా ఉంటుంది). చెవి నొప్పి. దవడ కండరాల నొప్పులు. కొందరిలో చెవిలో హోరుమనే శబ్దం (టినైటిస్). నోరు నొప్పి కారణంగా ఆహారం తీసుకోలేకపోవడం. నోరు తెరవడానికి, మూయడానికి ఇబ్బంది. రకాలు అవేక్ బ్రక్సిజమ్: కొందరు మెలకువగా ఉన్నప్పుడు పగటివేళ పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇలాంటి కేసుల్లో ఒత్తిడికి కారణం గుర్తించి కొంత కౌన్సెలింగ్ ఇస్తే సరిపోతుంది, చికిత్స పెద్దగా అవసరం లేదు. కొందరిలో ఏదైనా విషయంపై తీక్షణంగా దృష్టి కేంద్రీకరించినప్పుడు అసంకల్పితంగా దవడ బిగిస్తుంటారు, దీనికీ చికిత్స అవసరం ఉండదు. స్లీప్ బ్రక్సిజమ్: నిద్రలో ఉన్నప్పుడు అదేపనిగా పళ్లు కొరకడంతో పాటు తాము అలా చేస్తున్నామన్న విషయమే పిల్లలకు తెలియదు. పగటివేళల్లో మామూలుగానే ఉంటారు. వీళ్లకు చికిత్స అవసరం. రిస్క్ ఫ్యాక్టర్స్ పిల్లల్లో తీవ్రమైన ఒత్తిడి, యాంగ్జెటీ వంటి పరిస్థితులతో పాటు మేజర్ డిప్రెసివ్ డిజార్డర్స్ లేదా జనరలైజ్డ్ యాంగ్జెటీ డిజార్డర్స్ వంటి మానసిక పరిస్థితులు బ్రక్సిజమ్ను ప్రేరేపిస్తాయి. పెద్దవారిలో ఆల్కహాల్‌తో పాటు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ వంటివి ఎక్కువగా తాగడం. పెద్దల్లో కొన్ని రకాల ఔషధాలు (ముఖ్యంగా యాంగ్జెటీని తగ్గించడం కోసం వాడే సెలక్టివ్ సెరిటోనిన్ రీ-అప్ టేక్ ఇన్హిబిటార్స్ – ఎస్ఎస్ఆర్ఎస్ అనే మందులు). పెద్దవారిలో గురక రావడం (స్లీప్ ఆప్నియా) కారణంగా. మేనేజ్మెంట్ / చికిత్స బ్రక్సిజమ్ అనే కండిషన్ పిల్లల్లో ఎప్పుడో ఓసారి కనిపించడంగానీ లేదా అప్పుడప్పుడూ వస్తుంటే దానికి పెద్దగా చికిత్స అవసరం లేదు. కానీ పళ్లకు హాని కలిగించేదిగా ఉన్నప్పుడు తొలుత వారి పళ్లు దెబ్బతినకుండా పళ్ల డాక్టర్ ఆధ్వర్యంలో మౌత్ గార్డ్స్ అమర్చడం అవసరం. స్ట్రెస్ తగ్గించడానికి తొలుత కౌన్సెలింగ్, తర్వాత ధ్యానం వంటి పద్ధతులతో తేలికపాటి వ్యాయామాలు చేయించాలి. ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’తో చాలావరకు ఉపయోగం ఉంటుంది. జీవనశైలి (లైఫ్ స్టైల్)లో మార్పులు చేసుకోవాలి (పెద్దలు మద్యం అలవాటు వదిలేయడం, పరిమితికి మించి కాఫీలు, పొగ తాగడం వంటివి మానేయడం). కొన్ని పరీక్షల తర్వాత యాంగ్జెటీ, డిప్రెషన్ వంటివి ఉన్నాయని తేలితే… యాంగ్జియోలైటిక్స్ అనే యాంటీ యాంగ్జెటీ మందులతో పాటు, పళ్లు కొరుక్కోకుండా ఉండేందుకు మజిల్ రిలాక్సెంట్ ఔషధాలను ఇస్తారు.